- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ బామ్మర్ధి పై లోతుగా విచారణ జరపాలి: MP అనిల్ కుమార్ యాదవ్
దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ బామ్మర్ధిని లోతుగా విచారించాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..డ్రగ్స్ ను నియంత్రిస్తుంటే, బీఆర్ఎస్ కేటీఆర్ అండ్ టీమ్ దారుణాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. యువత జీవితాలను నాశనం చేసేందుకే ఇలాంటి విధానాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. డ్రగ్స్ స్టేట్ గా చేసేందుకు బీఆర్ ఎస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. అందుకే కేటీఆర్ బామ్మర్ది, ఫామ్ హౌజ్ రెయిడ్ లో లభించిన ఇతర వ్యక్తులను సంపూర్ణంగా ఎంక్వైయిరీ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలని అహర్నిశలు కృషి చేస్తుంటే, బీఆర్ఎస్ దీనికి రివర్స్ లో వెళ్లడం విచిత్రంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యాలు కంటే, రాజకీయమే లక్ష్యంగా బీఆర్ ఎస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందన్నారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన స్వంత ఫామ్ హౌస్ లో డ్రగ్, విదేశీ మద్యం తో పార్టీ ఇచ్చారన్నారు. డ్రగ్స్ మాఫియా ను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. ఈ డ్రగ్స్ పార్టీ లో ఎంత పెద్ద వారు ఉన్న వదిలిపెట్టమని, కఠినంగా శిక్షించాల్సిందే నని వివరించారు. డ్రగ్స్ కు యువత దూరంగా ఉండి మంచి భవిష్యత్తు తో బాగు పడాలని సీఎం రేవంత్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.