క్యాట్ తీర్పుపై ఐదుగురు ఐఏఎస్‌ల మరో సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |
క్యాట్ తీర్పుపై ఐదుగురు ఐఏఎస్‌ల మరో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేడర్ ఐఏఎస్(IAS) అధికారులకు క్యాట్(CAT) షాకిచ్చింది. ఏ రాష్ట్రం వాళ్లు ఆ రాష్ట్రంలో రేపు రిపోర్ట్‌ చేసి తీరాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా హితాన్నే పరిగణనలోకి తీసుకున్నామని క్యాట్ పేర్కొంది. ‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్‌ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా?’ అని క్యాట్‌ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా.. క్యాట్ తీర్పుపై ఐఏఎస్‌లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టును ఆశ్రయించాలని డిసైడ్ అయ్యారు. రేపు(బుధవారం) లంచ్ మోషన్ దాఖలు చేయనున్నారు. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. డీఓపీటీ ఫైనల్ కాదు. కోర్టుకు వెళ్లే హక్కు ఐఏఎస్‌లకు ఉంది అని ఐఏఎస్‌ల తరపు న్యాయవాది మీడియాకు చెప్పుకొచ్చారు. కాగా, ఈనెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, డి.రొనాల్డ్‌రాస్, జి.సృజనలకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story