- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి.. ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, సినిమా: రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వర్షం, డార్లింగ్, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. తన నటన, మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీలోని ఎంతో మంది స్టార్స్, టెక్నిషియన్స్‌కు.. తన సినిమా సెట్‌లోని ప్రతి ఒక్కరు ప్రభాస్ అందించే ఇంటి భోజనం పై ప్రశంసలు కురిపించినవారే.
కాగా ఈ రోజు (అక్టోబర్ 23న) ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు విషెస్ చెబుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ప్రభాస్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్‌కు బర్త్‌డే విష్ చేశారు. “అందరి డార్లింగ్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మీరు నటుడిగానే కాకుండా మీ వ్యక్తిత్వంతో లక్షలాది మందిలో స్పూర్తి నింపారు. ఈ ఏడాది కూడా మీరు బాక్సాఫీస్ విజయాలతో సందడి చేయాలని కోరుకుంటున్నాను”.. అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట ఆకట్టుకుంటోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.