- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అమోయ్ కుమార్.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
దిశ, డైనమిక్ బ్యూరో: పశుసంవర్ధక సంయుక్త కార్యదర్శి అమోయ్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు. బుధవారం ఉదయం బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న కేసులో అమోయ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. అమోయ్ కమార్ తమ భూములు బెదిరించి తీసుకున్నారని రెవెన్యూ అధికారులకు పోలీసులకు స్థానిక రైతులు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్ పాత్రపై నిజానిజాలు తేల్చేందుకు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మీడియా కంట పడకుండా ఇవాళ ఉదయం 8 గంటలకు అమోయ్ కుమార్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు కలెక్టర్ గా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ పై ఈడీ విచారణ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతున్నది. ఈ కేసు వ్యవహారం అంతిమంగా ఏ రూపం తీసుకోబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.