వెన్నంపల్లి రింగ్ రోడ్డుకి రూ. 7 కోట్ల నిధులు మంజూరు..

by Sumithra |
వెన్నంపల్లి రింగ్ రోడ్డుకి రూ. 7 కోట్ల నిధులు మంజూరు..
X

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పనిచేస్తున్నారని మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకులు గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ రెండు వలసల రహదారి రింగ్ రోడ్డుకు పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఏడు కోట్లు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వరుసల రహదారికి ఏడు కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు గ్రామస్తులు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారన్నారు.

గ్రామాల్లో అంతర్గత రోడ్లు, బీటీ రోడ్లు, రెండు వరుసల రహదారులు మంజూరు చేసి వాటి నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. విజ్జన్నను ఎన్నికల సమయంలో వెన్నంపల్లి గ్రామస్తులు రెండు వరుసుల రింగ్ రోడ్డు కావాలని కూరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గ్రామానికి రింగ్ రోడ్డును ఏడు కోట్ల నిధులతో మంజూరు చేశారన్నారు. వెన్నంపల్లి దగ్గర్లో ఉన్న పాండవులంక జలపాతానికి త్వరలోనే ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో రహదారి నిర్మించుకుంటున్నామని తెలిపారు. పెద్దపెల్లి ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని వారు తెలిపారు. అడగగానే గ్రామానికి రింగ్ రోడ్డు మంజూరు చేసిన పెద్దపెల్లి ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజరవేన సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, నాయకులు కలవైన రమేష్, పనాస మల్లయ్య, వెల్తూరి రమేష్, కారుకూరి శంకరయ్య, బిసగోని తిరుపతి, ఉప్పుల శ్రావణ్ కుమార్, ఎండి మునీర్, మదాసి సతీష్, శివరామకృష్ణ, రాజయ్య, రాజు, తమ్మి రెడ్డి, బీసగొని రమేష్, గ్రామస్థులు, నాయకులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed