పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసుల నిఘా.. అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు

by karthikeya |
పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసుల నిఘా.. అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పబ్స్ హోటల్స్, రెస్టారెంట్లలో మంగళవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రూల్స్‌ని అతిక్రమించి అర్థరాత్రి వరకు పబ్బులు నడుపుతున్న యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డ్రగ్స్ వినియోగంపై కూడా ఆరా తీశారు. ఇటీవల నిర్వహించిన డ్రైవ్‌లో కొంతమంది యువత బయట మాదకద్రవ్యాలు తీసుకుని పబ్బులకు వస్తున్నట్లు తేలడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొంతమంది పోలీసుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ అదే తరహాలో డ్రగ్స్‌ దందా కొనసాగిస్తున్నారని సమాచారం అందడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా మంగళవారం రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ జోన్‌లోని బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్ల లైసెన్సులను చెక్ చేయడమే కాకుండా.. సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసీ పరిమిషన్లు ఉన్నాయా..? లేదా..? అని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు లిక్కర్‌ను సప్లై చేస్తే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే పబ్బులలో మాదకద్రవ్యాలను అమ్మితే సీజ్ చేసి సీరియస్ యాక్షన్‌ను తీసుకుంటామని యజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story