పిల్లలు రాత్రిళ్లు నిద్రపోకుండా మారాం చేస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి

by Anjali |   ( Updated:2024-10-23 09:41:38.0  )
పిల్లలు రాత్రిళ్లు నిద్రపోకుండా మారాం చేస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి నిమిషం వారిని కనిపెడుతూ పిల్లల పట్ల జాగ్రత్త వహిస్తారు. అయితే సాధారణంగా పిల్లల్ని పడుకోబెట్టడం పెద్ద పని. పిల్లల్ని పెంచడం ఒకేత్తు అయితే వారిని నిద్రపుచచ్చడం మరో ఎత్తు.

చిన్న పిల్లల్ని నిద్రపుచ్చడం అంటే పెద్ద టాస్క్. కొంతమంది పిల్లలైతే నైట్ ఒకటి, రెండు అయినా నిద్రపోరు. మరికొంతమంది పిల్లలు అర్థరాత్రి లేచి ఏడుస్తుంటారు. దీంతో ఇంట్లో ఉన్నవారికి కూడా నైట్ నిద్ర ఉండదు. నిద్రకు భంగం కలుగుతుంది. కాగా రాత్రి పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.

పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ తో పాటు నిద్ర కూడా ముఖ్యం. తప్పకుండా పిల్లలు కూడా 8 గంటలైనా నిద్రపోవాలి. అయితే రాత్రిపూట పిల్లలు హాయిగా నిద్రించాలంటే స్లీప్ రొటిన్ క్రియేట్ చేయాలి. అంటే ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రించేలా పిల్లల్ని తయారు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పగటి పూట నిద్రపోవడం వల్ల కొంతమంది పిల్లలు రాత్రి నిద్రపోరు. కాగా పిల్లలు రాత్రి నిద్రపోవాలంటే మంచి వాతావరణాన్ని కల్పించాలి. అందుకోసం నైట్ లైట్లు అన్ని ఆఫ్ చేయాలి.

పిల్లలకు ఫోన్లు దూరంగా ఉంచాలి. ల్యాప్ ట్యాప్స్ వంటి గ్యాడ్జెట్లు వాడటం తగ్గించాలి. పడుకునేముందు వీటికి దూరంగా ఉంచడం మంచిది. పిల్లలు పడుకునే ముందు స్నానం చేయించండి. ఆడుకుని అలసిపోతారు కాబట్టి స్నానం చేయించడం వల్ల హాయిగా నిద్రపోతారు. పిల్లలకు ఎక్కువగా వాటర్ తాగించండి. నిద్ర మధ్యలో లేస్తే నీళ్లు తాగించి మళ్లీ పడుకోబెట్టండి. అలాగే నిద్ర మధ్యలో కలవరిస్తే, ఉలిక్కి పడటం లాంటివి చేస్తే తప్పకుండా వైద్నుడ్ని సంప్రదించండని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed