Godavari Floods: క్రమంగా పెరుగుతోన్న గోదావరి ఉధృతి.. డేంజర్‌ జోన్‌లో భద్రాచలం

by Shiva |   ( Updated:2024-09-11 03:59:22.0  )
Godavari Floods:  క్రమంగా పెరుగుతోన్న గోదావరి ఉధృతి.. డేంజర్‌ జోన్‌లో భద్రాచలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రచలంలోని గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. తాజాగా, బుధవారం ఉదయానికి గోదావరి నీటి మట్టం 50.5 అడుగుల వద్ద కొనసాగుతోంది. 48 అడుగులు మేర నీటి మట్టం చేరిన అనంతరం అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా పరిస్థితి ఇలానే కొనసాగితే.. నీటి మట్టం 53 అడుగులు దాటిన పక్షంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, 1986లో భద్రాచలంలో వద్ద అత్యధిక వరద నమోదైంది. నదిలో నీటి మట్టం 75.60 అడుగులకు చేరింది. ఆ సమయంలో 27 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహించింది. 2022 వరదల్లో ప్రవాహం 71.30 అడుగులుగా నమోదు కాగా, 21.78 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడిచి పెట్టారు. ప్రస్తుతం ఆ స్థాయిలో ప్రమాదం లేకపోయినా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed