The Sabarmati Report : టీజర్ విడుదల.. పాత్రికేయులుగా ఆకట్టుకుంటోన్న రాశీ కన్నా- విక్రాంత్ మాస్సే

by Anjali |   ( Updated:2024-10-26 14:35:08.0  )
The Sabarmati Report : టీజర్ విడుదల.. పాత్రికేయులుగా ఆకట్టుకుంటోన్న రాశీ కన్నా- విక్రాంత్ మాస్సే
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey) అండ్ టాలీవుడ్ హీరోయిన్ రాశీ కన్నా(Raashii khanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న ది సబర్మతీ రిపోర్ట్(The Sabarmati Report) వచ్చే నెల (నవంబరు) 15 వ తేదీన గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. గోద్రా రైలు దుర్ఘటన అనుకోకుండా జరిగిన కథ కాదు.. ఈ కథ వెనక అందరికీ తెలియని ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయని తెలుస్తోంది. రిధి డోగ్రా(Ridhi Dogra) ముఖ్య పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను రంజన్ చందేల్(Ranjan Chandel) రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ది సబర్మతీ రిపోర్ట్ మూవీ నుంచి మేకర్స్ టీజర్(Teaser) ను సోషల్ మీడియా వేదికన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో చూసినట్లైతే.. ఇందులో ‘దేశ చరిత్రను మార్చి సంఘటన భవిష్యత్తును మార్చిన పరిణామాలు. సత్యాన్ని గగ్గోలు పెట్టిస్తూ భయపెట్టొచ్చ. కానీ.. ఓడించలేము’’ అంటూ డైలాగ్ వస్తోంది. రాశీ కన్నా, విక్రాంత్.. నిజాన్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులుగా(journalists) కనిపిస్తారు. అయితే ఈ కథ 2002 ఫిబ్రవర 27 న జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 59 మంది మరణించారు. ఈ స్టోరీ ఆధారంగానే తెరకెక్కుతోన్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. ఇక ఈ మూవీని ఏక్తా కపూర్(Ekta Kapoor) అండ్ శోభా కపూర్(Shobha Kapoor) నిర్మిస్తున్నారు. రాశీ-విక్రాంత్ పాత్రికేయులుగా ఆకట్టుకుంటోన్న ఈ చిత్ర టీజర్ ప్రస్తుం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Advertisement

Next Story

Most Viewed