తెలంగాణ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా దాన కిషోర్

by Gantepaka Srikanth |
తెలంగాణ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా దాన కిషోర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ర్ట గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరిగా దాన కిషోర్‌కు అదనపు భాద్యతలనిస్తూ సీఎస్ శాంత కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఏఅండ్‌ యూడీ) శాఖకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎం.దానకిషోర్‌ గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పదవికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ)లో నియామక ఉత్తర్వులు పొందారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరిగా చేసిన బుర్రావెంకటేశం టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమకం కావడంతో ఖాళీ అయిన స్థానంలో దాన కిషోర్‌ను నియమించారు.

Advertisement

Next Story