- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS పాలనపై దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్!
దిశ, వెబ్‌డెస్క్: BRS పాలనపై ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపక్ రెడ్డి తరఫున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ప్రజల పాలన కావాలా? కుటుంబ పరిపాలన కావాలా? తేల్చుకోవాలన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
తెలంగాణలో నాయకులు మంత్రులు అవినీతిలో కురుకుపోయారన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో ఈ ప్రభుత్వం ఎం చేసిందో అందరికి తెలుసన్నారు. ఏ పార్టీ కి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు గమనించాలన్నారు. మా పొత్తు ఉన్నది జనసేనతో అని.. మిగిలిన విషయాలు హై కమాండ్ చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక కమ్యూనిటీకి సంబంధించి నట్టుగా ఉందన్నారు. భూములు కూడా అమ్ముతాం అంటున్నారు అది కరెక్ట్ కాదన్నారు.