Cyber Crimes: యువకుల వినూత్న ఆలోచన.. అభినందించిన వీసీ సజ్జనార్

by Ramesh Goud |
Cyber Crimes: యువకుల వినూత్న ఆలోచన.. అభినందించిన వీసీ సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరాలపై అవగాహాన కల్పిస్తూ.. వినాయక మండపం ఏర్పాటు చేసిన దుబ్బాక పట్టణ యువకుల వినూత్న ఆలోచనను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు. అంతేగాక ఆ మండపానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ట్వీట్ లో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వినూత్న ఆలోచనతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

భక్తి భావంతో పాటు సమాజం హితం ఎంతో ముఖ్యమని ఈ అసోసియేషన్ గుర్తించడం గొప్ప విషయమని చెప్పారు. అలాగే సైబర్ నేరాలు రోజురోజుకీ పెట్రేగిపోతున్నాయని, అమాయకులను మాయమాటలతో మోసగాళ్ళు కోట్లల్లో కుచ్చుటోపి పెడుతున్నారని వివరించారు. సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కాగా దుబ్బాక పట్టణంలో కొందరు యువకుడు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సైబర్ మోసాలు, నేరాలు, పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు హెల్ప్ లైన్ నంబర్ కూడా ముద్రించారు. అంతేగాక సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా ఉన్న కొన్ని పేపర్ క్లిప్పింగ్‌లను సైతం పోస్టర్‌లో వేశారు.

Advertisement

Next Story

Most Viewed