గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రేగిపోతున్న సైబర్ నేరాలు.. ఎక్స్‌లో ఎండీ సజ్జనార్ పోస్ట్

by Ramesh N |
గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రేగిపోతున్న సైబర్ నేరాలు.. ఎక్స్‌లో ఎండీ సజ్జనార్ పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ నేరాలు పెట్రేగిపోతున్నాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. గ్రామీణుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెడుతున్నారని తెలిపారు.సైబర్ నేరాల నివారణకు స్వీయ అవగాహన కలిగి ఉండటం ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన 'యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్' కృషి అభినందనీయం అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వారు ముద్రించిన కరపత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సైబర్ మోసాలు, నేరాలు-పాటించాల్సిన జాగ్రత్తలపై కరపత్రంలో వారు ముద్రించారు. ఫెడెక్స్ పార్సిల్ అంటూ మోసాలు, ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్‌తో బెదిరింపులు, ఈ-కేవైసీ పేరుతో కుచ్చుటోపి, క్రిప్టో కరెన్సీ, ట్రేడింగ్‌లో పెట్టుబడులంటూ సోషల్ మీడియాపై లింక్స్.. లాంటి పద్దతులతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ 1930 నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి నేరుగా ఫిర్యాదు ఇవ్వొచ్చని కరపత్రం పబ్లీష్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed