గ్రూప్-1 అభ్యర్థులతో సచివాలయం వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్.. సీఎస్ శాంతికుమారి రిక్వెస్ట్

by Mahesh |   ( Updated:2024-10-19 10:14:30.0  )
గ్రూప్-1 అభ్యర్థులతో సచివాలయం వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్.. సీఎస్ శాంతికుమారి రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులు తమకు మద్దతుగా నిలవాలని శుక్రవారం కరీంనగర్ వెళ్లి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కోరారు. అలాగే పోలీసులు విచక్షణ రహితంగా తమపై లాఠీచార్జ్ చేశారని బండికి వివరించారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం తాను అశోక్ నగర్ వచ్చి గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న బండి.. పార్టీ కార్యకర్తలు అనుబంధ సంస్థలతో కలిసి.. గ్రూప్-1 అభ్యర్థులతో పాటు వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే చలో సెక్రటెరియట్ కు పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఫోన్ చేసింది. గ్రూప్-1 అభ్యర్థులకు సంబంధించిన జీవో 29 పై చర్చించడానికి సచివాలయానికి రావాలని ఆమె ఈ సందర్భంగా బండి సంజయ్ కు పిలుపునిచ్చారు. ఒక వేళ బండి సంజయ్ రావడం కుదరకపోతే.. తన బృందాన్ని చర్చలకు పంపాలని, ఈ ఆందోళనను విరమించాలని సీఎస్ శాంతికుమారి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed