‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి: సుధీర్ బాబు

by Hamsa |
‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి: సుధీర్ బాబు
X

దిశ, సినిమా: శివ కుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతున్న ఈ చిత్రానికి రిషితేశ్వరి యోగి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్. ఈ మూవీ అక్టోబర్ 25న రాబోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సుధీర్ బాబు, దర్శకులు వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య, వితికా షెరు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం..

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘‘టీజీ విశ్వప్రసాద్‌ను పదేళ్ల క్రితం కలిశాను. ఆయన అప్పటికీ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. ఈ మూవీ ట్రైలర్ చూశాను. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచి పాత్రలంటే వారినే రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశారు. నేను కృష్ణవంశీ చిత్రానికి, బాఘీ చిత్రాలకు ఆడిషన్స్ చేశాను. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి. ఈ మూవీ చాలా కొత్తగా, రీఫ్రెషింగ్‌గా ఉండబోతోందనిపిస్తోంది. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’’ అని అన్నారు.

Advertisement

Next Story