- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CS Shanti Kumari : ఆ పాఠశాలల పురోగతిపై ప్రతివారం సమావేశాలు.. సీఎస్ ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: కొడంగల్, మధిర నియోజకవర్గం, లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోగా ప్రారంబించాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌మెంట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పరిపాలనా అనుమతులు కోసం ప్రతిపాదనలు సమర్పించేందుకు అనుసరించాల్సిన విధానాలు, ప్రతిపాదనల ప్రక్రియకు నోడల్ విభాగం ఖరారుపై చర్చించారు.
సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ, రెసిడెన్షియల్ పాఠశాలలకు భూములు కేటాయించడంపై మీటింగ్‌లో చర్చించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతివారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌రాజు, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, బి వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీధర్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.