- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌తో పొత్తుపై సీపీఎం నేత తమ్మినేని క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీపీఎం, సీపీఐ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముషీరాబాద్‌లోని ముగ్ధుం భవన్‌లో ఇరు పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ తెలంగాణ గడ్డమీద కాలుమోపాలని చూస్తోందని, సర్వ శక్తులు ఉపయోగించైనా సరే అడ్డుకుంటామని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. 2024లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం విచ్ఛిన్నం కాక తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాహుల్ గాంధీని అనర్హత వేటు అనేది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని కీలక ఆరోపణలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉంటే విచారించడంలో తప్పులేదు అని అభిప్రాయపడ్డారు. కానీ, వేధించేందుకే విచారణ పేరుతో టార్చర్ చేస్తున్నారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. పేపర్ లీకేజీలో ఇద్దరు ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది, కానీ ఇప్పటికే చాలామంది బయటపడ్డారు.. వెంటనే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. షర్మిల రాజకీయాలకు అతీతంగా కలసి రావాలంటే మేము స్వాగతిస్తాం కానీ, బీజేపీని విమర్శించడానికి ఆమెకు నోరు రాదు అని అన్నారు. ఏప్రిల్ 9వ తేదీన CPM, CPI నేతల ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నాము.. రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలి, ఎన్నికల్లో ఎలా పని చేయాలి అనేది చర్చిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల్లో కలిసి పని చేస్తాము అని కండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండే అవకాశం ఉందని, అసెంబ్లీలో కూడా కాలు మోపాలని చూస్తున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి: కోదండరామ్‌తో షర్మిల భేటీ.. టీసేవ్‌కు అధ్యక్షుడిగా ఉండాలని ప్రతిపాదన!