‘బిగ్‌బాస్‌’ను బద్దలుకొడదాం.. మరోసారి షో పై విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ

by Ramesh N |
‘బిగ్‌బాస్‌’ను బద్దలుకొడదాం.. మరోసారి షో పై విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘బిగ్‌బాస్‌’ అనేది చారిత్రకమైన హేయంతో కూడిన అంశమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విరుచుక పడ్డారు. ఇవాళ తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు హైదరాబాద్‌లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నేరపూరిత సామాజానికి దోహదపడేదన్నారు. అది దేశానికి, యువతకు చీడపురుగన్నారు.

ఈ సమాజాన్ని బిగ్ బాస్ షో ధ్వంసం చేస్తుందన్నారు. బిగ్ బాస్‌ను అడ్డుకోవాల్సిన కర్తవ్యం కళకారులకు అందరిపై ఉందన్నారు. అశ్లీలమైన ప్రదర్శన అని ఫైర్ అయ్యారు. కళాకారులు అందరూ కలిసి వచ్చే బిగ్ బాస్ ప్రోగ్రామ్‌ని ధ్వంసం చేయాలని, దాడులు సైతం చేయాలని పిలుపునిచ్చారు. అది ఆపించడమే కళాకారుల కర్తవ్యమని వెల్లడించారు. ప్రత్యక్ష పోరాటాల ద్వారా ఆ బిగ్ బాస్ ను అంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story