కేంద్రంలో మోడీ.. ఏపీలో జగన్ అరాచక పాలన : సీపీఐ నారాయణ

by Vinod kumar |
YCP MP Gorantla Madhav made a free blue film, Says CPI Narayana
X

దిశ, తెలంగాణ బ్యూరో: అటు కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ దొందూదొందే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత నిర్ణయం తీసుకోగా, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేదనే సాకుతో ఎలాంటి ఆధారాలు లేకపోయినా నలుగురు తన పార్టీ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్‌ను ఏ విధంగా వైసీపీ తమకు వేయలేదని పరిగణిస్తుంది..? అని ప్రశ్నించారు.

దుందుడుకు వైఖరితో తమను విభేధించే వాళ్లందరినీ మట్టుపెట్టాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే, కేంద్రంలో రాహుల్ గాంధీ తాకిడి తట్టుకోలేని వాళ్లు ఇన్విస్టిగేషన్ ఏజన్సీస్ తదితరాలను ఉపయోగించుకుని పార్లమెంటులో రద్దుచేసే ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ రెండూ కూడా ఒక విధమైన నిరాశ నిస్పృహలతో చేసే పనులే తప్ప మరొకటి కాదన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ అరాచకమైన రాజకీయ పద్ధతి అవలంభిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed