- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భక్తులకు చల్లని శుభవార్త!.. ఇక నుంచి అక్కడికి ప్రతీ గంటకో బస్సు
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నుంచి శ్రీశైలం దర్శనానికి వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ చల్లని శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు శ్రీశైలం వెళ్లాలనుకునే వారికి కొన్ని ప్రత్యేక సమయాల్లో నడిచే బస్సులు మాత్రమే ఉండగా.. ఇక నుంచి భక్తుల కోసం హైదరాబాద్ నుంచి ప్రతీ గంటకో ఏసీ బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఘాట్ రోడ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఏసీ బస్సులకు సంబందించిన వీడియోను పోస్టు చేశారు. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోందని, హైదరాబాద్ నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచిందని తెలిపారు.
అలాగే ఈ బస్సుల్లో ప్రయాణానికి జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్ఈఎల్ నుంచి రూ.564 టికెట్ ధర ఉంటుందని అన్నారు. అంతేగాక అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించిందని, వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతోందని అన్నారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించగలరు అని ఎక్స్ లో రాసుకొచ్చారు.