Amrapali: జీహెచ్ఎంసీ లో దోమల నిర్మూలనకు కూల్ ఫాగింగ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-09 05:34:15.0  )
Amrapali: జీహెచ్ఎంసీ లో దోమల నిర్మూలనకు కూల్ ఫాగింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : సౌత్ ఇండియాలోనే తొలిసారిగా జీహెచ్ఎంసీలో దోమల నిర్మూలనకు కూల్ ఫాగింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నట్లుగా కమిషనర్ అమ్రాపాలి వెల్లడించారు. తొలుత పైలట్ ప్రాజెక్టులో భాగంగా మూడు కూల్ ఫాగింగ్ మిషన్లను వినియోగించి దోమల నివారణకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. మునుముందు ఈ ప్రక్రియను మరింత విస్తరిస్తామన్నారు. హాట్ ఫాగింగ్ వల్ల చిన్నపిల్లలు, వృద్దుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో వాటర్ తో మిక్సింగ్ చేసే కొత్త లిక్విడ్ తో ఉపయోగించే కూల్ ఫాగింగ్ మిషన్లతో దోమల నివారణకు చర్యలు చేపట్టామన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూల్ ఫాగింగ్ ప్రక్రియకు అనుమతినిచ్చిందని, ప్రస్తుతం ఇండియాలో తొలిసారిగా గుజరాత్ లో కూల్ ఫాగింగ్ అమలు చేస్తున్నారని తెలిపారు. హాట్ ఫాగింగ్ తో దోమల నిర్మూలన పూర్తిగా జరగడం లేదని, కూల్ ఫాగింగ్ తో వందశాతం దోమలు చనిపోతాయన్నారు. అలాగే హాట్ ఫాగింగ్ మిషన్లతో ఏర్పడే డీజిల్ కాలుష్యం.. వినియోగం, సిబ్బంది చేతివాటంతో జరిగే డీజిల్ గల్లంతును కూల్ ఫాగింగ్ మిషన్ల ద్వారా అరికట్టగలుగుతామని తెలిపారు.

Advertisement

Next Story