కొండా మురళి దంపతులతో వివాదం.. ఎర్రబెల్లి స్వర్ణ రియాక్షన్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-01 06:08:23.0  )
కొండా మురళి దంపతులతో వివాదం.. ఎర్రబెల్లి స్వర్ణ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: కొండా మురళి దంపతులతో వివాదంపై వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ స్పందించారు. జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో తిరుగుతానన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం అభ్యర్థులు ఎవరున్నా గెలిపించుకోవడం తన బాధ్యత అన్నారు. కొండా మురళి దంపతులతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కొండా సురేఖ నాకు సోదరి లాంటిదన్నారు. ఊహాగానాలు, తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. కొండా సురేఖను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించలేదనడం అవాస్తవం అని కొట్టిపారేశారు. అయితే నిన్న వరంగల్‌లో కొండా మురళి దంపతుల, అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు బాహాబాహికి దిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story