- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కూతురు ‘కుర్చీ మడత పెట్టి’ పడేసింది! నెటిజన్ల కామెంట్స్ చూస్తే షాక్..
దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో ఓ పెళ్లి కూతురు ‘బుల్లెట్ బండి’ జానపద పాటకు పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత ప్రతి పెళ్లి వేడుకల్లో ఆ బుల్లెట్ బండి పాట ఫేమస్ అయిపోయింది. దాదాపు పెళ్ళి వేడుకల్లో ఆ పాటకు ప్రతీ పెళ్లి కూతురు డ్యాన్స్ వేయడం షురూ అయ్యింది. తాజాగా మరో పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో వైరల్ కావడంతో పాటు వివాదం కూడా అవుతుంది. ఎందుకంటే ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో ‘కూర్చీ మడత పెట్టి’ అనే పాటకు పెళ్లి కూతురు స్టేజీపై డాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ వేయడంపై పలువురు నెటిజన్లు మెచ్చుకోని ట్విట్టర్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటుడు మహేష్ బాబుకు ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్ళిలో ఐటెం సాంగ్ ఏమిటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘ఏమైనా అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు. "మరీ పాతకాలం వాడి లాగా మాట్లాడుతున్నావు" అంటారు. కానీ అసలు పెళ్ళిలో వెయ్యాల్సిన పాటేనా ఇది? అది కూడా పెళ్ళి కూతురు డ్యాన్స్ చేయడానికి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తన పెళ్లి తన ఇష్టం వచ్చిన పాటకు డాన్స్ చేస్తాదని మరికొంత మంది నెటిజన్లు సమర్ధిస్తున్నారు. డాన్స్ కేవలం సరదాగా వేశారని, అమ్మాయి ఆనందంతో మీకు పనిలేదా? అని మరొకరు కామెంట్ చేశారు.