- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral News : ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గోడ నిర్మాణం! బీఆర్ఎస్ ఆసక్తికర పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదారాబాద్‌లో ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహం వద్ద గోడ నిర్మాణం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతా ద్వారా ఫోటోలను పంచుకుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది.
‘అంబేద్కర్‌నే అవమానిస్తారా? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ విగ్రహం చుట్టూ ఈ అడ్డుగోడల నిర్మాణం క్షమించరాని నేరం. ప్రజా పాలనలో నిరసనలకే కాదు అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి బాధలు చెప్పుకునేందుకు కూడా ప్రజలకు అవకాశం లేకుండా చేస్తారా? విశ్వమానవుడి పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవం ఇదేనా? రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎంకి సిగ్గనిపించడం లేదా? ఇప్పటికే ప్రజా భవన్‌ను పోలీసులు, బారికేడ్లతో బందీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఉన్న గేటుకు తాళం వేశారు. ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న విగ్రహం చుట్టూ ఈ విపరీత చర్యలేంటి? అంబేద్కర్ ఆశయాలను కాలరాయడమే కాదు.. చివరికి ఆ మహానీయుని విగ్రహాలను అవమానిస్తున్న మీకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’ అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా ఫోటోలు పంచుకుంది.
అదేవిధంగా ‘టోనీ’ అనే నెటిజన్ ఎక్స్ వేదిక ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలుగు రాజకీయలను సామాజిక అంశాలతో కలిపే ఏకైక ప్రదేశం ఈ అంబేద్కర్ విగ్రహం. సమస్య ఉన్న ఎవరైనా సెక్రటేరియట్ కంటే ముందు వచ్చేది ఇక్కడికే. ఇక నుంచి ఎవరూ అక్కడికి రావొద్దనేగా అడ్డంగా గోడ కడుతున్నారు.. అని నెటిజన్ ఆరోపించారు.