బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం తోపులాట వెనుక కుట్ర కోణం: మంత్రి కొండా సురేఖ

by Satheesh |
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం తోపులాట వెనుక కుట్ర కోణం: మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయంలో చోటు చేసుకున్న తోపులాటపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ దీనిపై దర్యాప్తు చేస్తుందని తెలిపారు. కాగా, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్‌లో మంగళవారం జరిగిన తోపులాట ఘటనపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పోలీసులతో రివ్యూ నిర్వహంచారు. ఈ ఘటన వెనక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేసిన కొండా సురేఖ.. తోపులాట ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. కాగా, ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైన బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణోత్సవ వేడుకలకు ప్రభుత్వం తరుఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.

వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే, ప్రభుత్వం తరుఫున బల్కంపేట్ ఎల్లమ్మకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తుండగా ఆలయంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో మేయర్ విజయలక్ష్మితో పాటు మరి కొందరు భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో భద్రతా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులతో రివ్యూ నిర్వహించి.. తోపులాట ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తోపులాట వెనక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ అనడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story