కాంగ్రెస్ పనిచేసేది బీఆర్ఎస్ కోసమే.. ఆ నెలలో కేసీఆర్ రిటైర్ మెంట్ : తరుణ్ చుగ్

by Vinod kumar |
కాంగ్రెస్ పనిచేసేది బీఆర్ఎస్ కోసమే.. ఆ నెలలో కేసీఆర్ రిటైర్ మెంట్ : తరుణ్ చుగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేసేది బీఆర్ఎస్ కోసమేనని. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టేది కూడా ఆ పార్టీ కోసమేనని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఖర్గే, బీఆర్ఎస్ దోస్తీపై, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందంపై ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేసీఆర్ సహా.‌. దేశంలో రెండు డజన్ల మంది ప్రధాని‌ పదవిని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అందులో రాహుల్ గాంధీ, ఖర్గే, నితీష్, మమతా బెనర్జీ వంటి వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ అత్యాచార ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చుగ్ ఘాటు విమర్శలు చేశారు. పేపర్ లీకేజీ అంశంలో మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కార్ ని మార్చాలని అనుకుంటున్నారన్నారు. కేసీఆర్ కు కూడా తన రిటైర్ మెంట్ విషయం తెలుసని, నవంబర్ లో ఆయన రిటైర్ కాబోతున్నారని తరుణ్ చుగ్ జోస్యం చెప్పారు.

Advertisement

Next Story