- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: తీవ్ర అసంతృప్తి.. కొండా సురేఖ రాజీనామా
X
దిశ వెబ్ డెస్క్: టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితో ఆమె రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన కంటే జూనియర్లకు స్థానం కల్పించారని ఆమె వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడం అవమానించడమేనని కొండా సురేఖ తెలిపారు.
కాగా కొండా సురేఖ వరంగల్ జిల్లాలో కీలక నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి గతంలో ఆమె మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొండా సురేఖ.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆమెకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించారు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ అసంతృప్తికి గురయ్యారు.
Advertisement
Next Story