- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Congress: బీఆర్ఎస్ పార్టీ అసలు రంగు ఇదే!.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులకు స్పందించేవాళ్లు లేక సొంత పార్టీ వాళ్లతోనే నటించిపిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ అసలు రంగు ఇదేనని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఫోటోలు దిగే సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన పార్టీ నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వీడియోలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పొలంలో ఓ రైతును ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా నటించమని చెబుతూ.. ఆయన ఆ రైతును ఓదారుస్తున్నట్లుగా ఫోటోలు దిగారు.
ఈ ఫోటోల కోసం బీఆర్ఎస్ నాయకులు రైతును పొలంలో కూర్చొబెట్టి, బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా నటించమని చెబుతూ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనిపై సామా రామ్మోహన్ రెడ్డి.. ఇది బీఆర్ఎస్ పార్టీ అసలు రంగు అంటూ.. ఫోటోల కోసం ఎంతకు దిగజారిపోయారని విమర్శలు చేశారు. ప్రజాపాలనలో బీఆర్ఎస్ నాయకులకు స్పందించేవాళ్లు లేక సొంత పార్టీ వారితో నటించిపిస్తున్నారని తెలిపారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఇది కరెక్టే కదా అని ఎద్దేవా చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పందించి.. తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.