- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ కాదు.. టార్గెట్ హరీశ్‌రావు!
దిశ, తెలంగాణ బ్యూరో: పొలిటికల్‌గా బీఆర్ఎస్ పోటీయే కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో కామెంట్ చేశారు. పదేండ్లూ పవర్‌లో ఉంటామని ధీమాగా ప్రకటించారు. అందుకే ఆ పార్టీ బీజేపీలో విలీనం దిశగా ప్రయత్నాలు చేస్తున్నదని, ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా అది జరిగి తీరుతుందని తాజాగా ఢిల్లీలోనూ వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక ఎత్తయితే బీఆర్ఎస్ లీడర్ హరీశ్‌రావును సీఎం రేవంత్ ఎందుకు టార్గెట్ చేశారనేది ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయనను లైట్‌గా తీసుకుని హరీశ్‌రావుపైనే విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం వెనక సీఎం ఉద్దేశం పైనా గులాబీ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్‌ను మేనేజ్‌మెంట్ కోటా కింద లెక్కగట్టి విమర్శలు చేసిన సీఎం రేవంత్.. ఇటీవల కేటీఆర్ విమర్శలకు, ట్వీట్‌లకు, స్టేట్‌మెంట్లకు, సవాళ్లకు స్పందించడం లేదు.
హరీశ్ చుట్టూ స్టేట్ పాలిటిక్స్
సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా?.. లేదా రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగుతున్నారా?... లేదా ఆ పార్టీలో ఇమడకుండా చేయాలనుకుంటున్నారా?..ఇలాంటి ఎన్ని వాదనలు వినిపిస్తున్నా చివరకు హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య పార్టీలోనే ఆధిపత్య పోరు పరోక్షంగా మొదలైందనేది శ్రేణుల అభిప్రాయం. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే భావన కేడర్‌లో ఉన్నా గత కొన్ని రోజులుగా హరీశ్‌రావు చుట్టూ స్టేట్ పాలిటిక్స్ నడుస్తుండటంతో ఈ ఇద్దరిలో ఫ్యూచర్ లీడర్ ఎవరనే సరికొత్త చర్చ ఆ పార్టీలో మొదలైంది. తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కూడా దృష్టి మొత్తం హరీశ్‌రావు మీదకు మళ్లేందుకు కారణమైంది. వీరిద్దరి మధ్య కంటికి కనిపించని తీరులో ఆధిపత్య పోరు నడుస్తున్నదనే మాటలూ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. ఇందులో భాగమే పోటాపోటీగా ఇద్దరి మధ్య స్టేట్‌మెంట్లు, ఓపెన్ లెటర్లు, ట్వీట్‌లు, ప్రెస్‌మీట్‌ల హడావిడి అని ఉదహరించారు.
ఫోకస్ షిఫ్ట్ కేటీఆర్ టు హరీశ్‌రావు
గత కొన్ని రోజులుగా హరీశ్‌రావుపై సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు ఫోకస్ పెట్టి అగ్గిపెట్టె ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో బస్ స్టాప్‌లలో ఇటీవల దర్శనమిచ్చే పోస్టర్లు సైతం హరీశ్‌రావునే టార్గెట్ చేశాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్‌ను మేనేజ్‌మెంట్ కోటా అంటూ సీఎం రేవంత్ టార్గెట్ చేసినా తాజా బడ్జెట్ సెషన్‌లో మాత్రం అధికార పార్టీ నేతల ఫోకస్ హరీశ్‌రావు మీదకు మళ్లింది. ఈ సెషన్‌లో కేటీఆర్ పాత్ర హైలైట్ కాకపోవడంతో చివరకు సీఎం ఛాంబర్ ముందు నిరసన లాంటివి చేపట్టవలసి వచ్చిందని గులాబీ కేడర్ గుర్తుచేశారు. మార్షల్స్ హడావిడితో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా కేటీఆర్ ఉండేలా ప్లానింగ్ జరిగిందన్నారు. ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్‌రావు తరచూ విమర్శలు చేస్తున్నా అందులో సీఎం మాత్రం కేటీఆర్‌ను లైట్ తీసుకుని కౌంటర్‌లను హరీశ్‌రావుపైకి విసురుతున్నారని, ఇది ఇద్దరి మధ్య కనిపించని కోల్డ్ వార్‌కు దారితీసిందన్నది కేడర్ అభిప్రాయం.
బీఆర్ఎస్‌లో ఆల్టర్నేట్ హరీశ్!
కేటీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అనివార్యంగా ఆయనకు అది పొలిటికల్ మైలేజ్ ఇస్తుందనే ఉద్దేశంతోనే హరీశ్‌రావును కాంగ్రెస్ కార్నర్ చేస్తున్నదని, ఇది గులాబీ పార్టీలోనే సరికొత్త పోటీకి దారి తీసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఎలాగూ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేటీఆర్‌కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను ఆయనకు దూరం చేసి కాంగ్రెస్‌వైపు లాగే ఆపరేషన్ సక్సెస్ అయిందనే అభిప్రాయం హస్తం నేతల్లో నెలకొన్నది. మరికొన్ని రోజుల్లో ఇంకొందరు కూడా చేరుతారనే ధీమాతో ఉన్నారు. కేటీఆర్‌ను తెర మీదకు తేకుండా, ఆయన విమర్శలకు స్పందించకపోవడంతో ఆయన మాటల్ని పట్టించుకోవడంలేదనే మెసేజ్ జనంలోకి వెళ్తున్నది. మంత్రుల కౌంటర్ల స్థాయికి కేటీఆర్ పరిమితమయ్యారు. ఆటోమేటిక్‌గా కేటీఆర్ ఇమేజ్ గతంలో ఉన్నంతగా లేదని, ఇటీవల పల్చబడ్డదని, హరీశ్‌రావు బీఆర్ఎస్‌లో ఆల్టర్నేట్ అనే మాటలు వినిపిస్తున్నాయి.