- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్..! ఆలస్యం వెనుక భారీ వ్యూహం?
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో ప్రధాన పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ హోలీ తర్వాతే ప్రకటించబోతున్నట్లు సమాచారం. మొదటి విడతలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. మిగిలిన 13 సెగ్మెంట్లపై కసరత్తు పూర్తి చేసింది. ఫ్లాష్ సర్వేల పేరుతో పలు దఫాలుగా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నది. ఈ మేరకు బరిలోకి దింపేందుకు గెలుపు గుర్రాలను ఖరారు చేసిన అధిష్టానం జాబితాను పెండింగ్‌లో ఉంచడం వెనుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఆ రెండు స్థానాలపై పీటముడి..
ఫస్ట్‌లిస్ట్‌లో జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించించిన హైకమాండ్ భువనగిరి, ఖమ్మం మినహా మిగతాచోట్ల అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం సీఈసీ సమావేశం నిర్వహించి అదే రోజున లేదా ఆ మరుసటి రోజున సెకండ్ లిస్ట్ వెల్లడించే అవకాశముందని సమాచారం. ఇక భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్న కైలాశ్ నేత పోటీ పడుతుంటే, ఖమ్మం టికెట్ కోసం మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్, మరోమంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి బిగ్ టాస్క్‌గా మారింది.
ఆలస్యం వెనుక ‘ఆర్థిక భారం’ కోణం?..
కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలను ప్రకటించకపోవడం వెనుక అభ్యర్థులపై ఆర్థిక భారం పడకూడదనే ఆలోచన ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గెలుపు ధీమాతో ఉంది. బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనపడుతుండటంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే అభ్యర్థులకు ఆర్థిక భారం లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. కారణం ఏదైనా అభ్యర్థుల జాబితాపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.