- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటా’
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తాని చెప్పారు. తన పార్లమెంట్‌తో పాటు 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లి పనిచేస్తానని తెలిపారు. కాగా, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఒక స్థానానికి ఎంపిక చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. మరో అభ్యర్థిగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అయితే ఈ సారి సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని అందరూ ఊహించారు. కానీ, అనూహ్యంగా ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభకు ఎంపిక చేసింది.