- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్నను ఢీకొట్టేందుకు రంగంలోకి చెల్లి.. కాంగ్రెస్ భారీ ప్లాన్..!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై రెండుమూడు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు సమాచారం.ఈ నెల 20వ తేదీలోపు ఏ క్షణాన అయినా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగానే వైఎస్సార్ టీపీ విలీనం జరగనుంది. ఎలాంటి షరతులు లేకుండానే పార్టీ విలీనానికి షర్మిల ఒకే చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌లో షర్మిలకు సపోర్ట్‌గా ఒక వర్గం నిలిస్తే.. మరో వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వ్యతిరేకిస్తున్న రేవంత్ వర్గం హైకమాండ్‌కు పలు నివేదికలు సైతం సమర్పించినట్లు తెలుస్తోంది.
దీంతో ఆమెను ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న అన్న జగన్‌ను ఢీకొట్టేందుకు చెల్లిని రంగంలోకి దించాలని హస్తం పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు టాక్. అలా చేస్తే ఏపీలో పార్టీ ఉనికి చాటుకోవడంతో పాటు బలోపేతం అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇదిలావుండగా పార్టీ విలీనం తర్వాత తమ సంగతి ఏంటని షర్మిలను కార్యకర్తలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో కార్యకర్తలను కాపాడుకుంటానని షర్మిల భరోసా ఇచ్చినట్లు వినికిడి.