నిర్మాత దిల్ రాజుకే మద్దతు తెలిపిన సీపీఐ నేత నారాయణ

by srinivas |   ( Updated:2025-01-01 17:05:29.0  )
నిర్మాత దిల్ రాజుకే మద్దతు తెలిపిన సీపీఐ నేత నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: ‘పుష్పా-2’ మూవీ( 'Pushpa-2' movie) విడుదల సందర్భంగా జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో జరిగిన భేటీలో నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju) పాల్గొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ(Film industry) సమస్యలు, సినిమా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలపై చర్చించారు. చిత్రపరిశ్రమ సంక్షేమం, సహకారంపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు.

అయితే ఈ భేటీపై మాజీ మంత్రి కేటీఆర్(Former Minister Ktr) విమర్శలు చేశారు. డైవర్షన్‌లో భాగంగానే సినిమా వాళ్లపై సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) అసెంబ్లీలో మాట్లాడారని ఆరోపించారు. సినిమా వాళ్లతో సెటిల్‌ చేసుకుని ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం మాట్లాడటలేదని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగొద్దని, లేని పోని రాజకీయాలను ఆపాదించొద్దని చెప్పారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయ చేసిన సినీ పరిశ్రమను వాడుకోవద్దని దిల్ రాజు కోరారు.

అయితే నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలకు రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభిస్తోంది. సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీని వివాదాల్లోకి లాగొద్దన్న నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దిల్‌రాజు అభిప్రాయం సమంజసమేనన్నారు. ప్రభుత్వానికి, సినిమా రంగానికి విభేదాలు అవసరం లేదని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed