- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Venkatesh : మూడు వేలకు పైగా ఫ్యాన్స్‌తో ఓపికగా ఫొటోలు దిగిన స్టార్ హీరో... వావ్ గ్రేట్ అంటున్న నెటిజన్లు (వీడియో)
దిశ, సినిమా: విక్టరి వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (sankranthiki vasthunnam) సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాజిటివ్ అంచనాలు ఉన్న ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా విక్టరీ వెంకటేష్‌తో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా వెంకటేష్‌ను కలిసేందుకు ఫ్యాన్స్ (fans) భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే.. ఫ్యాన్స్ అందరిని పద్ధతిగా లైన్ కట్టించి మరి ఒక్కొక్కరితో నవ్వుతూ ఫొటోలకు పోజులు ఇచ్చాడు వెంకీ మామా. ఇదే విధంగా దాదాపుగా మూడు వేలకు పైగా ఫ్యాన్స్‌తో వెంటకేష్ ఫొటోలు దిగిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా (Social media)లో వైరల్ కావడంతో.. ఎంత ఓపికగా అభిమానులతో ఫొటోలు దిగావయ్యా అంటూ నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, ట్రైలర్, పోస్టర్లతో పాటు.. సాంగ్స్ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ముఖ్యంగా ‘గోదారిగట్టు’, ‘మీను’ సాంగ్‌కు ఇప్పుడు కూడా నెట్టింట సందడి చేస్తుంది. అంతే కాకుండా.. తాజాగా వచ్చిన ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ సాంగ్ కూడా మంచి స్పందనతో దూసుకుపోతుంది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడంతో ఫ్యాన్స్ మూవీ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.