Breaking News : లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి

by M.Rajitha |
Breaking News : లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ము కాశ్మీర్లో(Jammu kashmir) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. జమ్ము-కాశ్మీర్లోని బందిపురా(Bandipura) జిల్లాలో సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనాల్లో ఒకటి అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్టు సమాచారం. కాగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆర్మీ హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed