కోరుట్ల, మెట్ పల్లిలో దొంగల బీభత్సం..

by Sumithra |
కోరుట్ల, మెట్ పల్లిలో దొంగల బీభత్సం..
X

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న పలు దుకాణాలలో షట్టర్లు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. మెట్ పల్లి పట్టణంలోని ప్రధాన చౌరస్తా అయిన పాత బస్టాండ్ వద్ద రెండు షాపులలో దొంగలు దొంగతనానికి పాల్పడి దుకాణంలో ఉన్న చిల్లర నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే కోరుట్ల పట్టణంలో మూడు దుకాణాలలో చోరీకి పాల్పడి దాదాపు 50 వేల నగదు అపహరించుకుపోయారు.

గత రెండు మూడు నెలలలో రెండు మూడు సార్లు దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. పట్టణాల్లో నడిబొడ్డున జాతీయ రహదారికి ఆనుకొని దొంగతనాలు జరుగుతుండడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుల పెట్రోలింగ్ పెంచి, దొంగతనాలు జరగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. దొంగిలించిన నగదు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed