- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nara Lokesh : జగన్ మళ్లీ ప్రజల్లోకి రావడం మంచిదే: మంత్రి నారా లోకేష్
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Jagan) మళ్లీ ప్రజల్లోకి వస్తే మంచిదేనని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) చెప్పుకొచ్చారు. డొక్కా సీతమ్మ(Dokka Seethamma) మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-Day Meal Scheme) ప్రారంభించేందుకు విజయవాడ(Vijayawada)లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లిన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా వేశాము. గతంలో లాగా హెలికాప్టర్‌లో కాకుండా ఇఫ్పుడు జగన్(Jagan) నిర్భయంగా రోడ్లపైకి రావచ్చన్నారు. అలాగే మాజీ సీఎం జగన్ వచ్చి మేం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నామని ఈ సందర్భంగా లోకేష్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మాదిరి మాది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాదని.. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, ప్రజాదర్బార్ ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. 4వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) చెప్పుకొచ్చారు.
- Tags
- Nara lokesh