- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి దామోదర్ చొరవతో నెరవేరిన మండల ప్రజల కల..
దిశ, రేగోడ్ : వైద్య సౌకర్యం విషయంలో రేగోడ్ మండల ప్రజల దశబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన 108 అంబులెన్స్ మండల కేంద్రమైన రేగోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయింపు జరిగింది. అంబులెన్సును శనివారం నాడు కాంగ్రెస్ నాయకులు పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీసీసీ సభ్యుడు కిషన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర్ రావు మాట్లాడుతూ అత్యవసర చికిత్సలు, వైద్య సేవలను పొందడంలో ప్రజలు ఎదురుకుంటున్న అవస్థలను దృష్టిలో పెట్టుకుని మంత్రి దామోదర్ 108 అంబులెన్సును కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
108 ను మంజూరు చేయిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దామోదర్ హయాంలోనే ఆశించిన అభివృద్ధి జరిగిందని ఇక ముందు కూడా మరింత పురోగతి సాధ్యమని ఆశాభావం వెలిబుచ్చారు. మండల ప్రజలు అత్యవసర వైద్య సేవల కోసం 108ను వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పోచయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యుడు చోటు, నాయకుడు కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్లు శ్రీధర్, సంగమేశ్వర్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పీర్యా నాయక్, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.