- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
India Cements: ఇండియా సిమెంట్స్ కు కొత్త నాయకత్వాన్ని ప్రకటించిన అల్ట్రాటెక్..!
దిశ, వెబ్‌డెస్క్: ఆదిత్య బిర్లా(Aditya Birla) గ్రూప్‌కు చెందిన ప్రముఖ దిగ్గజ సిమెంట్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్(Ultratech Cement) ఈ ఏడాది జూలై 28న ఇండియా సిమెంట్స్ లిమిటెడ్(ICL)లో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ. 3,954 కోట్లకు కొనుగోలు చేయడానికి ఇండియా సిమెంట్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఇండియా సిమెంట్స్ సీఈఓ, ఎండీ పదవులకు ఎన్. శ్రీనివాసన్(N. Srinivasan) ఇటీవలే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ కు కొత్త నాయకత్వాన్ని నియమించినట్లు అల్ట్రాటెక్ సిమెంట్ బుధవారం ప్రకటించింది.
ఐసీఎల్ కొత్త సీఈఓ(CEO)గా సురేష్ వసంత్ పాటిల్(Suresh Vasant Patil), సీఎఫ్‌ఓ(CFO)గా కృష్ణగోపాల్ లడ్సారియా(Krishnagopal Ladsaria)ను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కాగా వసంత్ పాటిల్ 1988లో అల్ట్రాటెక్ సిమెంట్లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు. ఆయనకు సిమెంట్ రంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం అల్ట్రాటెక్‌లో రెడీ-మిక్స్ కాంక్రీట్& బిల్డింగ్ ప్రొడక్ట్ విభాగానికి అయన హెడ్(Head)గా పనిచేస్తున్నాడు. అలాగే కృష్ణగోపాల్ లడ్సారియా ఆదిత్య బిర్లా అనుబంధ కంపెనీ అయినా సెంచరీ ఎంకా(Century Enka)లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.