ముసలితనంలో మతిమరుపు సమస్యకు చెక్ పెట్టాలంటే..?

by Anjali |
ముసలితనంలో మతిమరుపు సమస్యకు చెక్ పెట్టాలంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మతిమరుపు(amnesia) సమస్యను ప్రజెంట్ డేస్‌లో చాలా మంది ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒత్తిడి కారణంగా మరికొంతమంది పలు సమస్యల కారణంగా మతిమరుపు వస్తుంటుంది. ముఖ్యంగా మెమోరీలాస్ అనేది కాలం గడిచేకొద్ది ఎక్కువ అవుతుంది. ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంటుంది. ముసలివారు అయ్యాక జ్జాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్(Alzheimer), మెదడు పనితీరు(brain function) మందగించడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. మరీ ఈ మతిమరుపుకు చెక్ పెట్టాలంటే ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

ముసలితనంలో మతిమరుపు రాకుండా ఉండాలంటే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు(Omega-3 fatty acids).. సాల్మన్ ఫిష్, మాకేరెల్, ఫ్యాటీ ఫిష్, సార్టినెస్ వంటివి తీసుకోవాలి. వీటితో పాటు చియా సీడ్స్(Chia seeds), సీ వీడ్, అవిసె గింజలు(Flax seeds), జనపనారర విత్తనాలు, బ్యూ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్(Strawberry) బెర్రీస్ పండ్లు తీసుకోవాలి. అలాగే మెదడు చురుగ్గా పనిచేయాలంటే పాలకూర, బచ్చలికూర, విటమిన్-కె(Vitamin-K), లుటీన్, మెంతికూర, గ్రీన్ క్యాప్సికం(Green capsicum), బ్రోకలి, బాదం, వాల్నట్స్ వంటి డ్రైఫ్రూట్స్(Dry fruits), బార్లీ, గోధుమలు జొన్న, బ్రౌన్ రైస్(Brown rice), ఓట్స్ వంటి తృణ ధాన్యాలు, బ్రోకలీ, గుమ్మడి గింజలు(Pumpkin seeds) డైట్ లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story