అనుమానాస్పద స్థితిలో మున్సిపల్ జవాన్ మృతి

by Aamani |
అనుమానాస్పద  స్థితిలో మున్సిపల్ జవాన్ మృతి
X

దిశ, మెదక్ ప్రతినిధి : చెట్టుకు ఉరి వేసుకొని అనుమానస్పద స్థితిలో మున్సిపల్ జవాన్ మృతి చెందిన ఘటన డంప్ యార్డ్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ పట్టణం పిట్లంబేస్‌ వీధికి చెందిన మల్లారెడ్డిపేట సంజీవ్‌(41) మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయంలో శానిటేషన్‌ విభాగంలో ఔట్‌ సోర్సింగ్‌లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.

డిసెంబర్‌ 31 సందర్భంగా స్నేహితులతో ఉన్నట్లుగా ఇంట్లో వారికి సమాచారం ఇచ్చాడు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల వరకు సంజీవ్‌ తన భార్య సావిత్రితో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. అనంతరం ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన లిప్ట్‌ చేయలేదని మృతుని భార్య సావిత్రి తెలిపారు. ఈ క్రమంలో మెదక్‌ డంప్‌యార్డులో సంజీవ్‌ ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంజీవ్‌ మృతి పట్ల పలు అనుమానలు ఉన్నాయని కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుని భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతునికి కుమారుడు రాజు, కూతురు పూజిత ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed