Malakpet: రాష్ట్రంలో మరో పోలీస్ ఆత్మహత్య

by Ramesh Goud |   ( Updated:2025-01-01 16:53:13.0  )
Malakpet: రాష్ట్రంలో మరో పోలీస్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఇద్దరు ఎస్ఐలు సహా ఓ హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుల్ ఆత్మహత్యకు(Suicide) పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మరవక ముందే బుధవారం మరో కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం సంచలనంగా మారింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్(Film Nagar PS) లో విధులు నిర్వహిస్తున్న జటావత్ కిరణ్(36) అనే కానిస్టేబుల్(Constable) మలక్ పేట(Malakpeta)లో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరి వేసుకొని చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు కిరణ్ 2014 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story