'దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యే జోక్యం లేకుండా చూడాలి'

by Vinod kumar |   ( Updated:2023-09-06 13:16:52.0  )
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యే జోక్యం లేకుండా చూడాలి
X

దిశ, వెబ్‌డెస్క్: దళిత బంధు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఇటీవలే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అయితే లబ్ధిదారుల ఎంపికలో ఈసారీ ఎమ్మెల్యేలే కీలకంగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లకు అప్పగిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చేయాలని నిబంధనల్లో చేర్చింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో రెండో విడతలోనూ ఎమ్మెల్యేలు ఆమోదించిన జాబితాలతోనే లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరు జరగనుంది. ఈ నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అద్యక్షురాలు (రామన్నపేట) గాదె శోభారాణి క్రిష్ణ స్పందించారు.

దళిత బంధులో ఎమ్మెల్యే జోక్యం లేకుండా గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని.. ''ఊరికి ఒక కోడి.. ఇంటికో ఈక'' లాగా కాకుండా మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుంకుడుపముల గ్రామం మదిరిగానే ప్రతి ఇంటికి ఇవ్వాలని.. ఎమ్మెల్యే గారి అనుచరులకే దళిత బంధు, అధికారంలో ఉన్న సర్పంచ్, MPTC లకే దళిత బంధు ఇవ్వడం సరికాదన్నారు. నిజమైన అర్హులకు దళిత బంధు ఇవ్వాలని గాదె శోభారాణి క్రిష్ణ కొరారు.

బీసీ బంధు ద్వారా మంజూరైన లక్ష రూపాయలను.. ఒకరికి మంజూరు అయితే ఇద్దరికీ పంచి ఇవ్వడం చేసినట్లు, దళిత బంధు కూడా ఒకరికి మంజూరు అయితే మరో ఇద్దరు కలిపి అనధికారికంగా ఒప్పందాలు చేస్తున్నట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయని గాదె శోభారాణి క్రిష్ణ ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీల వారిని ఆకర్షించడం చేస్తున్నారన్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed