- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైడ్రా పరిధిని యాదాద్రి వరకూ విస్తరించండి.. సీఎంకు ప్రభుత్వ విప్ రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కీలక నేత, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మంగళవారం లేఖ రాశారు. హైడ్రా పరిధిని యాదాద్రి వరకూ విస్తరించాలని లేఖలో రిక్వెస్ట్ చేశారు. గత పదేళ్లలో యాదాద్రిలోనూ బీఆర్ఎస్ నేతలు అక్రమ నిర్మాణాలు అనేకం నిర్మించారని.. తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే హైడ్రాను యాదాద్రి వరకూ విస్తరించాలని రిక్వెస్ట్ చేశారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని నగరంలో ఆక్రమణలను సత్వరమే గుర్తించి వాటిని అడ్డుకోవడం హైడ్రా లక్ష్యం. ఈ నేపథ్యంలో నగరంలో హైడ్రా దూసుకుపోతోంది. ఎవరినీ వదలకుండా పంజా విసురుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.