మంత్రి పొన్నం ఆదర్శ నిర్ణయం! విద్యార్థులకు ఉపయోగపడేలా ప్లాన్

by Ramesh N |
మంత్రి పొన్నం ఆదర్శ నిర్ణయం! విద్యార్థులకు ఉపయోగపడేలా ప్లాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగాన్ని కాపాడండి - కాటన్‌ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిధులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్‌తో సన్మానం చేయోచ్చాని సూచించారు. అటు చేనేత వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుందని, కాటన్ టవల్స్ ఉపయోగకరంగా కూడా ఉంటాయని వెల్లడించారు.

లేదంటే పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు ఇవ్వాలని సూచించారు. మీరు తెచ్చే శాలువలు కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాద పరిచ్చినట్టు అవుతుందని, కప్పుకుంటే ఇది ఎందుకు పనికి రాదు.. ఎవరికీ ఉపయోగపడవన్నారు. ఈ శాలువలు ప్లాస్టిక్‌తో సమానమన్నారు. టవల్స్ కాని.. పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు లాంటివి మంత్రులు, పెద్దలు ఎవరి దగ్గరకు వెళ్లిన ఇవే ఇవ్వాలన్నారు. శాలువలు మన దగ్గర తయారయ్యేవి కాదు.. దయచేసి కాటన్‌ని ప్రోత్సహించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed