హైదరాబాద్‌లో కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం

by Mahesh |
హైదరాబాద్‌లో కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ సభ పక్ష సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం హైదరాబాద్ సమీపంలోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి..తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ నుంచి కొత్తగా ఎన్నుకోబడిన రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్విని.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నేతలకు పరిచయం చేయనున్నారు.

కేకే నివాసానికి అభిషేక్ సింఘ్వి

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే తన రాజ్యసభ సబ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నికల వచ్చింది. కేకే స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన అభిషేక్ సింఘ్విని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో నేడు ఆయన తెలంగాణ నేతలతో భేటీ కానున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన నేరుగా హైదరాబాద్ లోని కేకే నివాసానికి వెళ్లారు. అక్కడ కేకే తో కలిసి మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed