- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్: కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, మల్లు రవి, వీహెచ్ అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, మల్లు రవి, సీనియర్ నేత వీహెచ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్ నోటీసుల నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరువుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగా వీహెచ్, బల్మూరి వెంకట్, మల్లు రవి, అద్దంకి దయాకర్ వంటి నేతలను పోలీసులు గృహ నిర్భంధం చేశారు.
అంతేకాకుండా హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు. ఇక, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో మంత్రి కేటీర్ పీఏ తిరుపతి హస్తం ఉందని.. మంత్రి పేషి నుంచే ఇదంతా జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా తిరుపతి స్వగ్రామం తాటిపర్తి పరిసరాలు ఊర్లల్లో ఉంటున్న పలువురు గ్రూప్ 1 పరీక్షల్లో వందకు పైగా మార్కులు సాధించినట్టు సంచలన ఆరోపణ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తమకు ఇవ్వాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు.