- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు.. వీహెచ్ హ్యాపీ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతుందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు స్పందించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ప్రదిపాదన చేశారని ప్రశంసించారు. సోనియా పోటీ చేస్తానంటే అందరం స్వాగతించడమే కాదని.. బంపర్ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తామని అన్నారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఇంపాక్ట్ పడుతుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు సోనియా పోటీ కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ స్థానాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు ఎంపీ స్థానాల పరిధిలో అధిక అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకోగా.. సోనియా సునాయాసంగా విజయం సాధిస్తారని అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయమై త్వరలోనే సోనియాతో చర్చించి నియోజకవర్గాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.