- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘చంద్రబాబు, నితీష్‌లు జారితే మోడీ ఖతమే’
దిశ, తెలంగాణ బ్యూరో: చంద్రబాబు, నితీష్‌లు జారితే మోడీ ఔటేనని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని ఆ ఇద్దరు నేతలను రిక్వెస్టు చేస్తున్నానని తెలిపారు. మోడీ హవా అంటూ దేశమంతా భ్రమ కల్పించారన్నారు. కానీ మోడీకి అంత సీన్ లేదని ఈ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. బీజేపీలో అంతర్గతంగా వ్యతిరేకత వచ్చిందన్నారు. అందుకే హడావిడిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని తెలిపారు. మోడీని ప్రజలు నమ్మడం లేదన్నారు. అందుకే సీట్లు తగ్గాయన్నారు. 2014లో వారణాసిలో మోడీకి 3,71,781 మెజార్టీ రాగా, 2019లో నాలుగు లక్షల 71 వేల మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. కానీ 2024లో లక్షా 71 వేల మెజార్టీయే మాత్రమే వచ్చిందన్నారు. దీన్ని బట్టే మోడీ పవర్‌ను స్పష్టంగా తెలుసుకోవచ్చన్నారు. మోడీ ప్రజలను ఇంకా మోసం చేయలేడన్నారు. భవిష్యత్‌లో బీజేపీ కాలం చెల్లినట్లేనని స్పష్టం చేశారు.