- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు.. బిగ్ బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయపోతే కాంగ్రెస్ పార్టీకి ఆగస్ట్ సంక్షోభం తప్పదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు టీ- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీభవన్‌లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుండి 25 మంది, బీజేపీ నుండి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు తమ పార్టీ బలం 90 ప్లస్‌కు చేరుకుంటుందని, అలాంటప్పుడు తమ ప్రభుత్వం ఆగస్ట్‌లో ఎందుకు కూలిపోతుందని కౌంటర్ ఇచ్చారు.
తమ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, బీజేపీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగిందని ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబానికి మోసం అంటే తెలియదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అన్నీ అబద్ధాలే చెబుతోందని, దేవుడి పేరు చెప్పుకోవడం.. కన్ఫ్యూజ్ చేయడమే బీజేపీ అజెండా అని విమర్శలు గుప్పించారు.